శోభనాద్రిపురం పాఠశాలలో పరిశుభ్రతే లక్ష్యంగా శ్రమదానం నిర్వహించిన సర్పంచ్
రిపోర్టర్: KOLA MAHESH
స్థలం: నారాయణపురం
రామన్నపేట మండలంలోని శోభనాద్రిపురం గ్రామంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం ప్రాథమికోన్నత పాఠశాలలో శ్రమదానం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కంచి మధుసూదన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. పాఠశాల ఆవరణను శుభ్రం చేస్తూ విద్యార్థులకు, ప్రజలకు పరిశుభ్రత ఆవశ్యకతను చాటిచెప్పారు.