సుప్రీంకోర్టులో జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో వివిధ విభాగాల్లో రెండు వందల యాభై జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ ఏడో తేదీన ప్రారంభమై అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీతో ముగియనుంది. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సుప్రీంకోర్టు వర్గాలు స్పష్టం చేశాయి.