తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు రెండు లక్షల ఇళ్ళు మంజూరు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Telangana
తెలంగాణ గ్రామీణ ప్రాంత పేదల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద రాష్ట్రానికి రెండు లక్షల ఇళ్ళను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రకటించారు. కొత్త ఆవాస్ సర్వే జాబితా ఆధారంగా అర్హులైన కుటుంబాలకు ఈ పక్కా గృహాలు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు.