కరెంట్ వినియోగదారులకు భారీ షాక్: ట్రూ-అప్ పేరుతో రూ.5,420 కోట్ల భారం

రిపోర్టర్: సురేష్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో విద్యుత్ వినియోగదారులపై రూ.5,420.23 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుందని విద్యుత్ నియంత్రణ మండలి వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరాల్లో కొనుగోళ్ల అదనపు వ్యయం, రెవెన్యూ లోటును సర్దుబాటు చేసేందుకు డిస్కంలకు అనుమతిచ్చినట్లు అధికారులు తెలిపారు. వ్యవసాయ వాటాను ప్రభుత్వం భరించాలని ఆదేశించగా, మిగిలిన మొత్తాన్ని నవంబర్ నుంచి యూనిట్కు అదనంగా వసూలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ ట్రూ-అప్ ఛార్జీలతో సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం పడనుంది.