స్వచ్ఛతతో నేల పులకించిన శ్రీకాళహస్తి ప్రభుత్వ కళాశాల
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తిలోని ఎస్వీఏ ప్రభుత్వ కళాశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.బి. వాణిశ్రీ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, అధ్యాపకులు కళాశాల పరిసరాలను శుభ్రం చేశారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని అందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు.