ముంబై ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్యపై వీడని ఉద్రిక్తత

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ముంబై

ముంబై ఐఐటీలో రెండో సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనపై విద్యార్థులు రాత్రంతా నిరసనలు తెలిపారు. ఇది కులవివక్ష, సంస్థాగత వేధింపుల వల్లే జరిగిందని మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. సీఐడీ విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.