ఎన్టీఏ స్కోర్‌కార్డ్ పోతే తిరిగి పొందేందుకు మార్గదర్శకాలు విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
రిపోర్టర్: మహేష్
స్థలం: న్యూఢిల్లీ
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే పరీక్షలకు సంబంధించి స్కోర్‌కార్డ్ పోగొట్టుకున్న, దెబ్బతిన్న లేదా దొంగిలించబడిన అభ్యర్థుల కోసం ఎన్టీఏ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు మొదట డిజిలాకర్ ద్వారా స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఒకవేళ అక్కడ అందుబాటులో లేకపోతే అధికారిక వెబ్‌సైట్ నుంచి అనెక్సర్-1 దరఖాస్తును డౌన్‌లోడ్ చేసి, అవసరమైన పత్రాలతో పాటు ఈమెయిల్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలని ఎన్టీఏ స్పష్టం చేసింది.