ఆఫ్రికా మార్కెట్లోకి వియోనా ఫిన్‌టెక్ విస్తరణ: జింబాబ్వేలో సరికొత్త సేవలు
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ వియోనా ఫిన్‌టెక్ సంస్థ ఆఫ్రికా మార్కెట్లోకి విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సబ్ సహారన్ ప్రాంతంలో తమ ట్యాప్ అండ్ పే సాంకేతికతను అందించేందుకు తొలి గమ్యస్థానంగా జింబాబ్వేను ఎంచుకున్నట్లు తెలిపారు. సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల భారీ డిజిటల్ చెల్లింపుల మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకొని ఆ దేశ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.