ఫ్లోరిడాలో ఘోర విమాన ప్రమాదం: కూలిపోయే ముందు యువ కోపైలట్ చివరి సందేశం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ఫ్లోరిడా

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదానికి పది నిమిషాల ముందు ఇరవై ఏళ్ల కోపైలట్ నాథాలియా గడెల్హా ఫిగుయిరాస్ తన ప్రియుడికి టెక్స్ట్ మెసేజ్ పంపిందని ఆమె సవతి తండ్రి థియాగో కోర్టెలేటి వెల్లడించారు. విమానంలో తీవ్రమైన టర్బులెన్స్ ఉందని, ఐస్ ఏర్పడిందని ఆమె చివరి సందేశంలో పేర్కొన్నట్లు తెలిపారు. టెక్సాస్ నుంచి బహామాస్ వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.