పాలకీడులో కోటి ఎనభై లక్షలతో రోడ్డు ప్రారంభించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
రిపోర్టర్: రమేష్
స్థలం: సూర్యాపేట
పాలకీడు మండలంలో రూ.1.80 కోట్ల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. సమగ్ర అభివృద్ధికి రోడ్డు సౌకర్యమే కీలకమని పేర్కొంటూ ఆయన ఈ కార్యక్రమం నిర్వహించారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. పలు గ్రావాలను అనుసంధానించే ఈ నూతన రహదారి నిర్మాణంతో స్థానిక ప్రజలకు రవాణా ఇబ్బందులు తొలగిపోతాయని అధికారులు తెలిపారు.