'ప్రాణాలు తీసేందుకే కారుతో ఢీకొట్టాడు': లక్నోలో యువతిపై హత్యాయత్నం

రిపోర్టర్: మహేష్ స్థలం: లక్నో

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని గోమ్‌తీ నగర్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో ప్రేమికుడి మోసాన్ని నిలదీసిన ఇరవ్రెండేళ్ల యువతి అనామికపై షాహనవాజ్ అలీ అనే వ్యక్తి కారుతో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మరో యువతితో కారులో తిరుగుతున్న నిందితుడిని అనామిక నిలదీయగా, వాగ్వాదం తర్వాత కారుతో ఆమెను ఢీకొట్టి సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు మీటర్ల దూరం బోనెట్పై ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు షాహనవాజ్‌ను అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.