వర్షాభావంతో విజయనగరం జిల్లాలో రైతులపై అదనపు ఆర్థిక భారం

రిపోర్టర్: అశోక్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగునీరు అందక ఇంజిన్ల ద్వారా నీటిని తోడి పంటలను కాపాడుకునేందుకు ఎకరాకు రూ.3 వేల వరకు అదనపు ఖర్చు చేస్తున్నారు. జిల్లాలో 39.84 శాతం వర్షపాత లోటు ఉండటంతో వరి నాట్లు, ఇతర పంటల సాగు గణనీయంగా తగ్గింది. పెట్టుబడులు పెట్టినా వర్షాలు పడకపోతే పంటలు ఎండిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.