బీఆర్ఎస్ పాలనలో కృష్ణా జలాలపై మంత్రి జూపల్లి తీవ్ర విమర్శలు

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

బీఆర్ఎస్ పదేళ్ల హయంలో కృష్ణా జలాలను కేవలం 28 నుండి 33 శాతం మాత్రమే వాడుకున్నారని, 67 నుండి 72 శాతం నీటిని ఆంధ్రప్రదేశ్‌కు వదిలేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా రాజీ పడి, సంతకాలు పెట్టి తెలంగాణ నీటిని వదిలేసిందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.