నేను బతికే ఉన్నాను వదంతులు నమ్మొద్దన్న సీనియర్ నటి వడివుక్కరాశి
రిపోర్టర్: రాము
స్థలం: చెన్నై
తమిళ చిత్రసీమకు చెందిన సీనియర్ నటి వడివుక్కరాశి తన మృతిపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఐదు దశాబ్దాలుగా చిత్రసీమలో కొనసాగుతున్న ఆమె, తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తూ అసత్య వార్తలకు చెక్ పెట్టారు.