తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్
రిపోర్టర్: రాము
స్థలం: తిరుమల
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర గవర్నర్ దర్శించుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా స్వామివారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన గవర్నర్కు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు పూర్తి చేశారు.