హరిణి హంతకులను కఠినంగా శిక్షించాలంటూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ

రిపోర్టర్: bhukya Narasimha rao స్థలం: జులూరుపాడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన నర్సింగ్ విద్యార్థిని హరిణి హత్యను నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. పట్టపగలే దారుణ హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ డిమాండ్ చేశారు. మహిళలపై పెరుగుతున్న దాడులను అరికట్టాలని, బాధితురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని సమగ్ర విచారణ ద్వారా న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు బాలాజీ, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.