చెన్నైలో మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్
రిపోర్టర్: రమేష్
స్థలం: చెన్నై
మలేషియా ఎయిర్‌లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో చెన్నైలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. కౌలాలంపూర్ నుంచి జెడ్డా వెళ్తున్న విమానంలో ఇంజిన్ సమస్య గుర్తించిన పైలట్లు, 186 మంది ప్రయాణికులతో సురక్షితంగా చెన్నైకి మళ్లించారు. అధికారులు ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించి ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారు. తిరుచిరాపల్లి నుంచి సింగపూర్ వెళ్తున్న మరో విమానం కూడా చెన్నైలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.