నవరాత్రి వేడుకల్లో వేరికోస్ వెయిన్స్ బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: Hyderabad
నవరాత్రి వేడుకల్లో గర్బా నృత్యాలు చేసే వేరికోస్ వెయిన్స్ బాధితులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వాస్కులర్ సర్జన్ డాక్టర్ సుమిత్ కపాడియా వెల్లడించారు. ఎక్కువసేపు నిలబడకుండా నడుస్తూ ఉండాలని, నృత్యం చేసే సమయంలో విరామం తీసుకోవాలని ఆయన సూచించారు. నృత్యాల అనంతరం కాళ్లను పైకి ఎత్తి విశ్రాంతి తీసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుందని, దీని ద్వారా నొప్పులు తగ్గుతాయని వైద్యులు స్పష్టం చేశారు.