కార్మిక హక్కుల సాధనకు నిరంతరం పోరాడతామని శ్రీరాంపూర్లో గర్జించిన ఏఐటీయూసీ

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

శ్రీరాంపూర్ ఏరియాలోని సీసీసీ నస్పూర్ లో శనివారం ఏఐటీయూసీ నూట ఏడో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నరసయ్య భవన్ ఆవరణలో ఎర్రజెండా ఎగురవేశారు. అనంతరం యూనియన్ నాయకులు మాట్లాడుతూ సింగరేణి సంస్థ పరిరక్షణతో పాటు కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు.