గజపతినగరం మండలంలో కేంద్ర పింఛను నిధుల జమ పైలట్ ప్రాజెక్ట్
రిపోర్టర్: శివ
స్థలం: విజయనగరం
జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వ పింఛను నిధుల వాటాను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే విధానాన్ని విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్లు సెర్ప్ కార్యదర్శి వాకాటి కరుణ తెలిపారు. ఈ మండలంలో కొత్త విధానం వర్తించే లబ్ధిదారులు వెయ్యి తొమ్మిది వందల పంతొమ్మిది మంది ఉన్నారని, వారందరికీ వ్యక్తిగత లేఖలు మరియు ఫోన్ల ద్వారా సమాచారం అందించినట్లు మంగళవారం ఒక ప్రకటనలో ఆమె స్పష్టం చేశారు.