బ్రిటన్‌లో సాంకేతిక లోపం.. వెయ్యికి పైగా విమానాలు రద్దు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: World

బ్రిటన్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో ఏర్పడిన తీవ్ర సాంకేతిక లోపం కారణంగా వెయ్యికి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఫ్లైట్ ప్లానింగ్ ప్రాసెసింగ్ సిస్టమ్ విఫలమవడంతో ప్రధాన విమానాశ్రయాల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ముందస్తు సమాచారం లేకపోవడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో గంటల తరబడి పడిగాపులు కాశారు. లోపాన్ని సరిదిద్దినట్లు అధికారులు తెలిపినా, విమానాల సర్దుబాటుకు సమయం పడుతుందని స్పష్టం చేశారు.