తక్కెళ్లపాడులో పనులు పూర్తి చేసిన సర్పంచ్ను ప్రశంసలతో ముంచెత్తిన మంత్రి సీతక్క

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఎర్రుపాలెం

ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడు గ్రామంలో అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసినందుకు సర్పంచ్ ముక్కెర రామకృష్ణారెడ్డిని మంత్రి సీతక్క అభినందించారు. గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పంచాయతీరాజ్ కమిషనర్ ఆయన పనితీరును ప్రశంసించారు. ప్రభుత్వం మంజూరు చేసిన వీఓ భవనాలు, షెడ్లు, గోడౌన్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయడం ద్వారా బిల్లుల నగదు వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుందని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.