విద్యార్థులకు అలర్ట్: సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల

రిపోర్టర్: మహేష్ స్థలం: కలికిరి

దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూళ్లలో 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరు మరియు తొమ్మిదో తరగతుల ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి డిసెంబర్ రెండు వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తామని, ఆలస్య రుసుముతో డిసెంబర్ ఆరు వరకు గడువు ఉంటుందని వెల్లడించారు. జనవరి 31న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని, రాష్ట్రంలోని పలు ప్రధాన కేంద్రాల్ లో ఈ పరీక్ష ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.