విద్యార్థులకు అలర్ట్: అక్టోబర్ మూడో వారంలో సీఏ ఫైనల్ హాల్టికెట్లు
రిపోర్టర్: సతీష్
స్థలం: న్యూఢిల్లీ
చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ రెండు నుంచి జరుగనున్న సీఏ ఫైనల్ పరీక్షలకు సంబంధించి హాల్టికెట్లను అక్టోబర్ మూడో వారంలో విడుదల చేయనున్నట్లు ఐసీఏఐ అధికారులు వెల్లడించారు. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ లాగిన్ వివరాలను నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. నవంబర్ రెండు, నాలుగు, ఆరు తేదీల్లో గ్రూప్ వన్ అలాగే తొమ్మిది, పదకొండు, పదమూడు తేదీల్లో గ్రూప్ టూ పరీక్షలు జరుగనున్నాయి.