ఓయో హోటల్ యువతి మృతి కేసులో ప్రియుడు ఆత్మహత్యాయత్నం
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని మాదాపూర్ ఓయో హోటల్లో షారోన్ నిఖిత అనే యువతి అనుమానాస్పద మృతి కేసులో ప్రధాన నిందితుడైన ప్రియుడు రవితేజ అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఈదుమెట్ల మర్రిపాలెంలోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ తాగి బలవన్మరణానికి యత్నించిన రవితేజను విశాఖ కేజీహెచ్‌కు తరలించగా ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.