రచయిత డాక్టర్ కె శ్రీనివాసరావుకు సృజనగాథ జీవిత సాఫల్య పురస్కారం

రిపోర్టర్: మహేష్ స్థలం: న్యూఢిల్లీ

సృజనాత్మక రచనా రంగంలో విశేష కృషి చేసిన ప్రముఖ రచయిత డాక్టర్ కె.శ్రీనివాసరావుకు సృజనగాథ జీవిత సాఫల్య పురస్కారం లభించింది. అండమాన్ నికోబార్ రాజధాని శ్రీ విజయపురంలో జరుగుతున్న 26వ అంతర్జాతీయ హిందీ సదస్సు సందర్భంగా డాక్టర్ సవితా మోహన్, డాక్టర్ జయప్రకాశ్ మానస్ తదితరుల చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.