వాట్సాప్లో సైబర్ మోసం గుట్టురట్టు: దీపావళి కానుక పేరుతో భారీ కుట్ర

రిపోర్టర్: గోపి స్థలం: Hyderabad

దీపావళి కానుక కింద ఎనిమిది వేల రూపాయలు ఇస్తామంటూ వాట్సాప్లో వస్తున్న నకిలీ సందేశాలు పూర్తిగా మోసపూరితమైనవని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ స్పష్టం చేశారు. అపరిచిత లింక్లను క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలు ఇస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయని ఆమె హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మోసపోతే వెంటనే పంతొమ్మిది వందల ముప్పై నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు.