మహాకావ్య శ్రీ రామాయణ కథ సినిమాపై వ్యూహాత్మక నెగెటివ్ ప్రచారం: ప్రకాష్ మహోబియా
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
మహాకావ్య శ్రీ రామాయణ కథ సినిమాపై కొందరు కావాలనే వ్యూహాత్మక నెగెటివ్ ప్రచారం చేశారని ఆ చిత్ర నిర్మాత ప్రకాష్ మహోబియా తీవ్రంగా ఆరోపించారు. నితేష్ తివారీ రామాయణం సినిమా వస్తున్న తరుణంలోనే తమ చిత్రంపై యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో తప్పుడు సమాచారం ప్రచారం చేయించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా రీ-రిలీజ్ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఎదురైన చేదు అనుభవాలపై ఆయన తాజాగా పలు కీలక విషయాలు వెల్లడించారు.