బాల్య వివాహాల నివారణపై అవగాహన: మాచ్నూర్ లో సర్పంచ్ ప్రత్యేక కార్యక్రమం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఝరాసంగం
జహీరాబాద్ ఝరాసంగం మండల మాచ్నూర్ గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో బాల్య వివాహాలు మరియు బాలింతల పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మాధవి వెంకటేశం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దినాకర్, వార్డు సభ్యులు దేవపుత్ర, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రాములు, అంగన్వాడి టీచర్లు జగదీశ్వరి, నాగమణి, పిల్లలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.