గ్రామ పంచాయతీ అభివృద్ధి పనుల్లో భారీగా అవినీతి

రిపోర్టర్: సురేష్ స్థలం: నాగర్ కర్నూల్

నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో అభివృద్ధి పనుల పేరుతో భారీ అవకతవకలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. మార్చి నెలలో ఫాగింగ్ యంత్రం కొనుగోలులో బహిరంగ మార్కెట్ ధరకంటే రెండింతలు ఎక్కువగా బిల్లులు చూపించి నిధులు కాజేస్తున్నారని వారు మండిపడ్డారు. ఐమాక్స్ లైట్ల విషయంలోనూ ఇదే తరహా అక్రమాలు జరిగాయని తెలిపారు. తక్షణమే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.