ఇరాన్ లోని ఖాసిమ్ దీవిపై అమెరికా వైమానిక దాడి కలకలం

రిపోర్టర్: రమేష్ స్థలం: న్యూయార్క్

ఇరాన్ కు చెందిన ఖాసిమ్ దీవిపై సోమవారం అమెరికా బలగాలు వైమానిక దాడి చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొన్నదని ఓ అధికారి వెల్లడించారు. టెహ్రాన్ తో శాంతి ప్రతిపాదనల కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఈ దాడులు జరగడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. హోర్ముజ్ జలసంధిలోని ఈ దీవిలో అయిదు ప్రదేశాల్ లో భారీ పేలుళ్లు సంభవించగా ఇరానీ న్యూస్ ఏజెన్సీ ఐఆర్ఎన్ఏ ఈ విషయాన్ని ధృవీకరించింది.