యాదగిరిగుట్టలో వెండి జోడు సేవను దర్శించుకుని పులకించిన భక్తులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: యాదగిరిగుట్ట

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వెండి మొక్కు జోడు సేవ అత్యంత వైభవంగా జరిగింది. శనివారం సాయంత్రం స్వామివారిని గరుఢ వాహనంపై, అమ్మవారిని తిరుచ్చిపై వేంచేపు చేశారు. అనంతరం మాఢ వీధుల్లో మంగళ వాయిద్యాలతో నేత్రపర్వంగా ఊరేగించి, మంగళ నీరాజనాలు సమర్పించారు. ఈ జోడు సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు.