విశాఖ ఎంపీ నిధుల కేటాయింపు: ఎస్‌కోటలో వైద్య, విద్యా అభివృద్ధికి రూ.70 లక్షలు
రిపోర్టర్: సతీష్
స్థలం: విజయనగరం
విశాఖపట్నం ఎంపీ భరత్ తన కోటా నిధుల నుంచి శృంగవరపుకోట నియోజకవర్గానికి రూ.70 లక్షలను వివిధ అభివృద్ధి పనుల కోసం మంజూరు చేశారని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆదివారం వెల్లడించారు. ఎస్‌కోట ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్య సదుపాయాల మెరుగుదల కోసం రూ.30 లక్షలు, కొత్తవలస మండలం మంగళపాలెం పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి రూ.40 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. విద్య, వైద్య రంగానికి నిధులు మంజూరు చేసిన ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.