భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నర్సింగ్ విద్యార్థిని హరిణి మృతిపై ఉద్రిక్తత

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న హరిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంటి వెనుక చెత్తకుప్పలో బలమైన గాయాలతో మృతదేహం లభ్యం కావడంతో కుటుంబసభ్యులు హత్యగా ఆరోపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ దళిత, ఆదివాసీ సంఘాలు రాస్తారోకో నిర్వహించగా, దోషులను వదిలే ప్రసక్తే లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.