బాలీవుడ్ లో తీవ్ర విషాదం: ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా మృతి

రిపోర్టర్: హరి స్థలం: ముంబయి

బాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నిర్మాత సంజయ్ గుప్తా శుక్రవారం రాత్రి తన ఇంటి బాత్రూమ్ లో ప్రమాదవశాత్తు జారిపడటంతో తలకు తీవ్ర గాయమై కన్నుమూసినట్లు దర్శకుడు అశోక్ పండిట్ ధ్రువీకరించారు. ముంబయి అండర్వరల్డ్, క్రైమ్, యాక్షన్ నేపథ్యంలో పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించి ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న ఆయన మరణంతో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.