భారత్‌లో 26.7 కోట్ల మందికి పొగాకు వ్యసనం!

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: భారతదేశం

భారతదేశంలో పొగాకు వాడకంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే విస్తుపోయే నిజాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా 26.7 కోట్ల మంది వయోజనులు పొగాకుకు బానిసయ్యారు. చైనా తర్వాత ప్రపంచంలో పొగాకును అత్యధికంగా వినియోగిస్తున్న దేశంగా భారత్ రెండో స్థానంలో నిలిచింది. మిజోరంలో అత్యధికంగా పురుషులు 73శాతం, మహిళలు 62శాతం మంది పొగాకు ఉత్పత్తులు వాడుతున్నారు. చౌకగా లభించడం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఈ వ్యసనం బారిన పడుతున్నారు.