హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో అమరులకు ఘన నివాళి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లోని వార్ మెమోరియల్ వద్ద అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు. భారత యూనియన్‌లో హైదరాబాద్ విలీనం కోసం పోరాడిన యోధుల సాహసాన్ని, త్యాగాలను ఈ చారిత్రక దినం ఎప్పటికీ గుర్తు చేస్తుందని ఈ సందర్భంగా కొనియాడారు.