ఈసీ నిర్ణయంపై రాహుల్ గాంధీ ధ్వజం: బీజేపీకి తొత్తుగా మారారని ఫైర్

రిపోర్టర్: అశోక్ స్థలం: New Delhi

అనుకూలించని వాతావరణం కారణంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా తలపెట్టిన ప్రజా అభిశంసన కార్యక్రమాన్ని శనివారానికి వాయిదా వేస్తున్నట్లు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. నూతనఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వర్షంలో సీనియర్ నేతలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, నవంబర్ మొదటి తేదీన రామ్లీలా మైదాన్ వరకు భారీ ప్రదర్శన నిర్వహిస్తామని స్పష్టం చేశారు.