తెలంగాణకు భారీ నిధులు: పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: కిరణ్
స్థలం: Hyderabad
కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన నాలుగో నేషనల్ ఎపెక్స్ కమిటీ సమావేశంలో తెలంగాణకు రూ.3,892 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఐదు మెగా ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపిందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రాష్ట్రానికి రూ.873.49 కోట్ల ఆర్థిక సాయం అందనుండగా, హైదరాబాద్ తాగునీటి సరఫరా మరియు వరంగల్ వరదనీటి నిర్వహణ పనులకు ఈ నిధులు వెచ్చించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.