ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికలకు ఎన్ఎస్ యూఐ అభ్యర్థుల ప్రకటన
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: న్యూఢిల్లీ
ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల కోసం కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్ యూఐ అభ్యర్థులను ప్రకటించింది. అధ్యక్ష పదవికి విజయ్ శంకర్ మీనాను బరిలో నిలిపింది. ఉపాధ్యక్షుడిగా వీర్ చత్రాత్, కార్యదర్శిగా నమ్రతా చౌదరి, సంయుక్త కార్యదర్శిగా గోపాల్ చౌదరి పోటీ చేయనున్నారు. విద్యార్థి హక్కులు, వసతి గృహాల సమస్యలు ప్రధాన అజెండాగా ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించనున్నట్లు ఎన్ఎస్ యూఐ స్పష్టం చేసింది.