మనుబోలులో భక్తిశ్రద్ధలతో ఘనంగా గణనాథుని నిమజ్జనోత్సవ కార్యక్రమం

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని తూర్పు వీధిలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపం వద్ద అర్చకులు సాయి కుమార్ శర్మ ఆరు రోజులుగా విశేష పూజలు అందుకున్న వినాయకుడి నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా మెత్తాళ్ల శివ పద్మావతి వ్యవహరించగా లడ్డు వేలం పాటలో భాగంగా శారద ఎలక్ట్రానిక్ అల్లాబక్షు 55 వేలకు లడ్డును దక్కించుకున్నారు. అలాగే డబ్బుల దండను శివ బాలాజీ సూపర్ మార్కెట్ అధినేత 21 వేలకు మరియు వెండి కాయిన్ను సుమంత్ 27 వేలకు కైవసం చేసుకున్నారు.