భారతీయ పాస్‌పోర్ట్ నిరుపయోగంగా ఉందంటూ పారిశ్రామికవేత్త సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

భారతీయ పాస్‌పోర్ట్ విలువపై హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త జితేంద్ర ఎమ్మని చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. వీసా నిబంధనలు, సుదీర్ఘ డాక్యుమెంటేషన్ కారణంగా విదేశీ ప్రయాణాలు కష్టంగా మారాయని, భారీగా పన్నులు కడుతున్నప్పటికీ అంతర్జాతీయంగా ఎలాంటి ప్రయోజనాలు దక్కడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.