సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ ప్రజలకు ముమ్మాటికీ విద్రోహ దినమే
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు రెడ్డి చరణ్, పివైఎల్ రాష్ట్ర నాయకులు మనోహర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 అనేది విలీనమో, విమోచనమో కాదని ముమ్మాటికి విద్రోహ దినమే అని అన్నారు. చారిత్రక వాస్తవాలను వక్రీకరించి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నించడం సరికాదని వారు తీవ్రంగా ఖండించారు. రైతాంగ సాయుధ పోరాట చరిత్రను విస్మరించవద్దని డిమాండ్ చేశారు.