తెలుగుదేశం పార్టీ జెండా మోసే కార్యకర్తలకు అండగా ఉంటాం

రిపోర్టర్: రాజేష్ స్థలం: పార్వతీపురం

పార్వతీపురం మన్యం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సమావేశమయ్యారు. బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ జెండా మోసే ప్రతి ఒక్క కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సమన్వయంతో ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు.