సుప్రీంకోర్టు కీలక తీర్పు: విఫలమైన ప్రేమ సంబంధాలపై సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: సతీష్ స్థలం: న్యూఢిల్లీ

సమ్మతితో కూడిన లైంగిక సంబంధాలు ముగిసిన తర్వాత వాటిని అత్యాచారంగా మార్చడం ఆందోళనకరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తితో సంబంధం నుండి బయటకు వచ్చే హక్కు పురుషుడికి ఉంటుందని తేల్చిచెప్పింది. కేవలం మనస్పర్థల కారణంగా క్రిమినల్ చట్టాలను ఆయుధాలుగా మార్చడాన్ని సమాజం, న్యాయస్థానాలు తిరస్కరించాలని కోర్టు పేర్కొంటూ ఓ అత్యాచార కేసులో నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసింది.