హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ప్రపంచ ప్రసిద్ధ హామ్లీస్ నూతన స్టోర్ ప్రారంభం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

ప్రపంచ ప్రసిద్ధ బొమ్మల విక్రయ సంస్థ హామ్లీస్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తన 10వ దుకాణాన్ని అత్యంత వైభవంగా ప్రారంభించింది. మూడు అంతస్తులలో పది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లో పది వేలకు పైగా రకాల ఆటబొమ్మలు అందుబాటులో ఉన్నాయి. పిల్లల వినోదం, సృజనాత్మకతను పెంపొందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయగా ప్రారంభోత్సవ వేడుక ఘనంగా సాగింది.