మైఖేల్ జాక్సన్ బయోపిక్ పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మైఖేల్ సినిమాను తాను ఎంతో ఆస్వాదించినట్లు ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన రెడ్ ఇట్ ఏఎంఏ సెషన్ లో అభిమానులతో మాట్లాడిన ఆయన, చిన్నతనం నుంచి తాను ఆ పాప్ గాయకుడి సంగీతాన్ని ఇష్టపడతానని వెల్లడించారు. ఆంటోని ఫుక్వా దర్శకత్వంలో జా జాక్సన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ హాలీవుడ్ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోందని ఆయన తెలిపారు.