ముఖ్యమంత్రి పర్యటన వేళ బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Rajanna Sircilla
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులకు పాల్పడ్డారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ శ్రేణులు వినూత్నంగా పండ్లు తోముకుంటూ ఆందోళన చేపట్టారని నేతలు తెలిపారు. హామీలు అమలు చేయకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, అక్రమ అరెస్టులతో గొంతు నొక్కలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.