మంగళగిరిలో భారీ వర్షాల బీభత్సం: లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాకారం కూల్చివేత
రిపోర్టర్: కృష్ణ
స్థలం: మంగళగిరి
మురసు తుపాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాకారం ఇరవై అడుగుల పొడవునా కూలిపోయిందని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరం గాలి గోపురానికి ఆనుకుని ఉన్న ప్రాకారం కూలడంతో అధికారులు బుధవారం ఉదయం శిథిలాలను తొలగింపు పనులు చేపట్టారు. ఈ ఘటనను దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమూర్తితో పాటు ఇంజనీరింగ్ అధికారులు స్వయంగా పరిశీలించి తక్షణ చర్యలపై ఆదేశాలు జారీ చేశారు.