ఐఐటీ ఢిల్లీ కీలక నిర్ణయం: మానసిక ఆరోగ్య మద్దతు వ్యవస్థ బలోపేతం
రిపోర్టర్: గోపి
స్థలం: న్యూఢిల్లీ
విద్యార్థుల మానసిక ఆరోగ్య మద్దతు వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఐఐటీ ఢిల్లీ యాజమాన్యం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి క్లినికల్ సైకాలజిస్టులు, కౌన్సెలర్ల నియామకంతో పాటు స్వతంత్ర స్టూడెంట్ గ్రీవెన్స్ అంబుడ్స్పర్సన్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థి ఆత్మహత్య ఘటనపై ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ ముక్తా గుప్తా నేతృత్వంలోని కమిటీ అందించిన సిఫార్సుల మేరకు ఈ కీలక చర్యలు తీసుకుంటున్నట్లు ఐఐటీ వర్గాలు స్పష్టం చేశాయి.